Monday, December 23, 2024

అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో బిజెపితో ఒరిగేదేమీ లేదు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ – కాంగ్రెస్ పార్టీలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెస్‌తో ఒరిగేదేమీ లేదన్నారు. భవిష్యత్‌ అంతా బిఆర్‌ఎస్‌ పార్టీదే నని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గం, దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రెడ్డి రాజుల నరసయ్య, రెడ్డి రాజుల సోమయ్య తదితరులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత దయనీయ స్థితిలో ఉందన్నారు. బిజెపి పెద్దగా లేదని తెలిపారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా బిఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయిందన్నారు. అందుకే ప్రజలు బిఆర్‌ఎస్‌కు పట్టం కడుతున్నారని స్పష్టం చేశారు. కొత్తగా పార్టీలో చేరే వారికి సముచిత స్థానం కల్పిస్తూ వారికి పార్టీ అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News