Friday, January 10, 2025

ఒంటిపై పెట్రోల్ పోసుకుని వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి  : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ గ్రామంలో డబుల్ బెడ్రూం కోసం ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని వాటర్ ట్యాంక్ ఎక్కాడు. పోలీసులు గ్రామస్థులు, కుటుంబ సభ్యులు కిందకు దిగాలని వేడుకున్నా అతను దిగకపోవడంతో కొద్దిసేపు అక్కడ ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. జిల్లా కేంద్రంలో 720 డబుల్ బెడ్రూమ్స్ ఇళ్ల నిర్మాణం చేపట్టగా వాటి పంపిణికి అధికారులు రంగం సిద్దం చేసారు. లక్కీ డ్రా పద్దతిలో మంగళవారం లబ్దిరుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. ఇండ్ల కోసం కామారెడ్డి పట్టణంలో 5047 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో మూడు వేల 450 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు.

వీరిలో పదిమందికి ఒకటి చొప్పున లక్కీ డ్రా ద్వారా డబుల్ బెడ్రూం ఇళ్లు అలాట్ చేయడంతో ఇల్చిపూర్ కు చెందిన సంతోష్ అనే వ్యక్తి కి పేరు రాకపోవడంతో మనస్థాపం చెంది ఒంటిపై పెట్రోల్ పోసుకుని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో అడ్లూర్ లో ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఘటనా స్థలానికి చేరకున్న తహశీల్దార్ జాబితాలో బాదితుడి పేరు చేర్చడంతో కిందకు దిగాడు. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీపై లక్కీ డ్రా విదానంపై అర్హులైన పేదవారు పెదవి విరిచారు. టేక్రియాల్, అడ్లూర్, దేవునిపల్లి, రామేశ్వర్ పల్లి తదితర గ్రామాలలో ఇళ్ల దక్కని వారు నిరసనలు తెలిపి అధికారులకు శాపనార్థాలు పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News