న్యూఢిల్లీ: ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 నగరాలు భారతదేశంలోనే ఉన్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. 2022లో భారతదేశం ప్రపంచంలోనే ఎనిమిదవ అత్యంత కాలుష్య దేశంగా నిలిచింది. ఐదో స్థానం నుంచి ఎనిమిదవ స్థానానికి పడిపోయింది. స్విస్ సంస్థ మంగళవారం ఎయిర్ క్వాలిటీ రిపోర్టులో ఈ ర్యాంక్‌ను నిర్ణయించింది. పిఎం 53.3 మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటరుకు పడిపోయింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సురక్షిత పరిమితి కంటే పదిరెట్లు ఎక్కువ. 131దేశాల నుంచి డేటాను 30వేలకు పైగా క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా తీసుకున్నారు. ఈ అధ్యయనాన్ని ప్రభుత్వం లేదా ప్రభుత్వేతర సంస్థలు నిర్వహిస్తాయి.
7300 కంటే ఎక్కువ నగరాలను కలిగి ఉన్న జాబితాలో భారతీయ నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ నివేదిక భారతదేశంలో వాయు కాలుష్య ఆర్థిక వ్యయం 150బిలియన్ డాలర్లుగా పేర్కొంది. రవాణా రంగం 2.5 కాలుష్యంలో 2035శాతం కలిగిస్తోంది. పారిశ్రామిక యూనిట్లు, బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లు, బయోమాస్ దహనం తదితరాలు కాలుష్యానికి కారణం అవుతున్నాయి. కాగా పాకిస్థాన్‌లోని చైనాలోని హోటాన్ అత్యంత కాలుష్య నగరాల్లో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత భారత్‌లోని రాజస్థాన్‌కు చెందిన భివాడి, ఢిల్లీ నాలుగోస్థానంలో నిలిచాయి. 92.6 మైక్రోగ్రాముల వద్ద ఢిల్లీ పరిమితి కంటే దాదాపు 20రెట్లు ఎక్కువగా ఉంది.