- Advertisement -
న్యూఢిల్లీ : అసుస్ కొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. కన్స్యూమర్ నోట్‌బుక్ శ్రేణిని ఎఎండి రైజెన్ 7000 సిరీస్ ల్యాప్‌టాప్‌లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. యువ ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తల కోసం విడుదల చేసిన ఈ నూతన శ్రేణి ల్యాప్‌టాప్‌లలో ప్రతిష్టాత్మకమైన జెన్‌బుక్ 14 ఒఎల్‌ఇడితో పాటుగా వివోబుక్ సిరీస్, తాజా వివోబుక్ గో శ్రేణి కూడా ఉన్నాయి.
నూతన జెన్‌బుక్ 14 ఒఎల్‌ఇడి ప్రారంభధర రూ.89,990 కాగా వివోబుక్ గో 14 ధర రూ.42,990గా ఉంది. వివోబుక్ గో 15 ఒఎల్‌ఇడి ధర రూ.50,990, వివోబుక్ 15 ఎక్స్ ఒఎల్‌ఇడి ప్రారంభ ధర రూ. 66,990గా నిర్ణయించారు. ఈ ల్యాప్‌టాప్‌లను ఆన్‌లైన్‌లో అసుస్ ఇషాప్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయిస్తున్నారు.
- Advertisement -