Monday, December 23, 2024

సిఎపిఎఫ్‌లో మొత్తం 84,866 ఉద్యోగ ఖాళీలు: కేంద్రం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సిఆర్‌పిఎఫ్, బిఎస్‌ఎఫ్ వంటి ఆరు కేంద్ర సాయుధ పోలీసు దళాలలో(సిఎపిఎఫ్) మొత్తం 84,866 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వం బుధవారం రాజ్యసభలో వెల్లడించింది. ఈ ఆరు కేంద్ర సాయుధ పోలీసు దళాల మొత్తం పోస్టుల సంఖ్య 10,05,520 అని కూడా ప్రభుత్వం తెలిపింది.

గత ఐదు నెలల్లో సిఎపిఎఫ్‌లో 31,785 సిబ్బంది నియామకం జరిగిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. రిటైర్‌మెంట్లు, రాజీనామాలు, ప్రమోషన్లు, మరణాలు, కొత్త బెటాలియన్లు, కొత్త పోస్టుల సృష్టి వంటి కారణాల వల్ల సిఎపిఎఫ్‌లో ఖాళీలు ఏర్పడినట్లు ఆయన తెలిపారు.

2023 జనవరి 1వ తేదీ నాటికి సిఆర్‌పిఎఫ్‌లో 29,283ఖాళీలు, బిఎస్‌ఎఫ్‌లో 19,987 ఖాళీలు, సిఐఎస్‌ఎఫ్‌లో 19,475, ఎస్‌ఎస్‌బిలో 8,273, అస్సాం రైఫిల్స్‌లో 13,706 ఖాళీలు ఉన్నట్లు క లిఖితపూర్వక సమాధానంలో మంత్రి తెలిపారు. 2023 జనవరి 1 నాటికి సిఎపిఎఫ్‌లో మొత్తం 247 డాక్టర్ పోస్టులు, 2,354 నర్సుల, ఇతర మెడికల్ ప్రొఫెషనల్స్ పోస్టులకు ఖాళీలు ఉన్నట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News