Saturday, November 23, 2024

సమ్మర్ లో అసలు సిసలైన ఎంటర్ టైనర్ ‘మీటర్’: కిరణ్ అబ్బవరం

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కు ‘మీటర్’ చాలా ప్రత్యేకమైన చిత్రం. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. కిరణ్ అబ్బవరం పోలీస్ పాత్రలో కనిపించిన ఈ సినిమా టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు, మేకర్స్ మొదటి సింగిల్ చమ్మక్ చమ్మక్ పోరీని విడుదల చేయడం ద్వారా మ్యూజికల్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 70 ఎమ్‌ఎమ్‌లో భారీ జనసందోహం సమక్షంలో ఈ పాటను గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

విలన్, అతని అసిస్టెంట్.. కిరణ్ అబ్బవరం డిఫరెంట్ మీటర్ గురించి మాట్లాడుతూ ఫన్నీ నోట్‌లో ఈ పాట ప్రారంభమవుతుంది. మాస్, ఫుట్-ట్యాపింగ్ నంబర్‌ను సాయి కార్తీక్ స్కోర్ చేసారు భారీ సెట్‌లలో లావిష్ గా చిత్రీకరించారు. కంపోజర్ పాట యొక్క మూడ్, టెంపోను ఉల్లాసంగా ఉంచారు. కిరణ్, అతుల్య రవి ఒకరికొకరు తమ ప్రేమ, ఆప్యాయతను ప్రదర్శించారు. కిరణ్ అబ్బవరామ్ డ్యాన్స్‌లు ఆకట్టుకున్నాయి. అతని సరసన అతుల్య చక్కగా కనిపించింది. లిరిక్ రైటర్ బాలాజీ మాస్-ఆకట్టుకునే సాహిత్యం అందించారు. అరుణ్ కౌండిన్య , ఎంఎల్ గాయత్రి ఎనర్జిటిక్ రెండిషన్ పాటను ఇన్స్టెంట్ హిట్‌గా మార్చింది.

సాంగ్ లాంచ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. చమ్మక్ చమ్మక్ పాట షూటింగ్ జరిగిన సెట్ చూసి అసలు ఇది మన సాంగేనా ఇంతపెద్ద సెట్ లో షూట్ చేయబోతున్నామా అనిపించింది. యూనిట్ అంత ఇదే ఫీలయ్యాం. దీనికి కారణం నిర్మాత చెర్రీ గారు. ఇంత పెద్ద సెట్ లో ఇంత గ్రాండ్ గా ఒక పాట షూట్ చేశామంటే దానికి కారణం చెర్రీ గారే. నన్ను నమ్మి ఇంత పెద్ద సెట్ వేసిన చెర్రీగారికి కృతజ్ఞతలు. సాయి కార్తిక్ అన్న అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ పాటే కాదు ఇందులో పాటలన్నీ బావుంటాయి. భాను మాస్టర్ చాలా చక్కగా కొరియోగ్రఫీ చేశారు. మంచి మాస్ మూమెంట్స్ కంపోజ్ చేశారు. పరీక్షలన్నీ చక్కగా రాయండి. ఏప్రిల్ 7న మీ కోసం మంచి ఎంటర్ టైన్ మెంట్ ప్లాన్ చేశాం.

సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ మీటర్ ఎక్కడా తగ్గదు. సమ్మర్ లో మీటర్ సాలిడ్ ఎంటర్ టైన్ మెంట్. కామెడీ, యాక్షన్, లవ్ అన్నీ ఎలిమెంట్స్ ని చాలా బగా ఎంజాయ్ చేస్తారు. చాలా మంది ఎస్ఆర్ కళ్యాణ మండపం తర్వాత అంత ఎనర్జీ చూడలేదని కొందరు అన్నారు. మీటర్ లో మీరూ ఊహించినదాని కంటే ఎక్కువ ఎనర్జీ వుంటుంది. సినిమా ప్రాపర్ మీటర్ లో వుంటుంది. ఏ హీరో అయినా పెద్ద కమర్షియల్ హీరో అవ్వాలంటే అన్ని రకాల సినిమాలు చేయాలి. నేను కూడా అలా ఒకటి ప్రయత్నించాను. మీటర్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఏప్రిల్ 7న అందరూ థియేటర్ లో ఎంజాయ్ చేయండి’’అన్నారు

నిర్మాత చెర్రీ మాట్లాడుతూ.. సాయి కార్తిక్ చాలా మంచి సాంగ్ ఇచ్చారు. జేవీ అద్భుతమైన సెట్ చేశారు. ఈ పాట కోసం యాభై లక్షలు అనుకున్న సెట్ కోటి రూపాయిలు అయ్యింది (నవ్వుతూ). కానీ పాట అద్భుతంగా వచ్చింది. కొరియోగ్రఫర్ భాను మాస్ స్టెప్పులు గ్రేస్ ఫుల్ గా కంపోజ్ చేశారు. అలాగే లిరిక్ రైటర్ బాలాజీ సాంగ్ కి సరిపడే లిరిక్స్ ఇచ్చారు. రమేష్ చాలా అద్భుతంగా తీశారు. అతను చాలా పెద్ద దర్శకుడు అవుతాడు. అత్యల రవి గ్రేస్ ఫుల్ గా చేసింది. కిరణ్ ఇంతమాస్ అవతార్ లో చూడటం ఇదే మొదటిసారి. మాస్ స్టెప్పులు చాలా గ్రేస్ ఫుల్ గా చేశాడు. అందరూ ఏప్రిల్ 7న సినిమా చూసి పెద్ద విజయాన్ని ఇవ్వాలి’ అని కోరారు

దర్శకుడు రమేష్ మాట్లాడుతూ.. సాయి కార్తిక్ గారు చాలా మంచి పాట ఇచ్చారు. అలాగే బాలాజీ గారు బ్యూటీఫుల్ లిరిక్స్ ఇచ్చారు. ఇంత పెద్ద సెట్ లో ఈ పాటని షూట్ చేసే అవకాశం ఇచ్చి సపోర్ట్ చేసిన నిర్మాత చెర్రిగారికి కృతజ్ఞతలు. సమ్మర్ కి సమ్మగా వుండే సినిమా మీటర్. మాములుగా వుండదు పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు.

సాయి కార్తిక్ మాట్లాడుతూ మైత్రీ మూవీ మేకర్స్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ లో ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన చెర్రీ గారికి కృతజ్ఞతలు. రమేష్ పెద్ద దర్శకుడు అవుతారు. ఎమోషన్ ని కమర్షియల్ గా చేయడం అరుదైన కాంబినేషన్. దిన్ని చాలా చక్కగా తీశారు. పటాస్ నాకు పెద్ద హిట్టు. అలాంటి రేంజ్ లో వుండే మరో సినిమా మీటర్. కిరణ్ ఈ సినిమాతో పెద కమర్షియల్ అవ్వబోతున్నారు. ఈ సినిమాలో పని చేసిన అందరినీ కృతజ్ఞతలు. ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఆర్ట్ డైరెక్టర్ జెవి, డైలాగ్ రైటర్ సూర్య, కొరియోగ్రఫర్ భాను చిత్ర బృందం ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రాఫర్ కాగా, జెవి ఆర్ట్ డైరెక్టర్. అలేఖ్య లైన్ ప్రొడ్యూసర్ కాగా, బాబా సాయి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. కిరణ్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన సినిమాగా రూపొందిన ఈ చిత్రానికి బాల సుబ్రమణ్యం కెవివి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 7న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News