Wednesday, January 22, 2025

అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష రద్దు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాల్లో 837 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఈ నెల 5వ తేదీన నిర్వహించిన రాత పరీక్షను టిఎస్‌పిఎస్‌సి రద్దు చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ కావడంతో పరీక్షను రద్దు చేస్తున్నట్లు కమిషన్ తెలిపింది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 74 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 55 వేల మంది హాజరయ్యారు.

పరీక్షపై కమిషన్ న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంది. పరీక్షను రద్దు చేస్తే ఎదురయ్యే అభ్యంతరాలు, కొనసాగిస్తే వచ్చే వివాదాలను టిఎస్‌పిఎస్‌సి పరిగణనలోకి తీసుకుంది. రెండు రోజుల ముందే ప్రశ్నాపత్రం లీకైనట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలించిన టిఎస్‌పిఎస్‌సి ఎఇ పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News