Sunday, January 19, 2025

ఏకకాలంలో 14 వాద్య పరికరాలు వాయిస్తాడు(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: భారత్‌లో ట్యాలెంట్‌కు కొదవలేదు. సంగీతం కాని, నాట్యంలో కాని..మనవాళ్లు ఎవరికీ తీసిపోరని ఎన్నోసార్లు రుజువవుతూనే ఉంది. తాజాగా..ఒక వ్యక్తి ఏకకాలంలో 14 సంగీత వాద్యపరికరాలను ఉపయోగిస్తూ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ట్రావెల్ బ్లాగర్ షెహనాజ్ ట్రెజరీ ఈ ట్యాలెంటెడ్ ఆర్టిస్టును గుర్తించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేశారు.

గ్లాడ్‌సన్ పీటర్ అనే ఈ కళాకారుడు తన వీపుకు డ్రమ్స్‌ను తగిలించుకుని దాన్ని తన కాళ్లకు కనెక్ట్ చేసుకున్నాడు. అతను లయబద్ధంగా కదులుతుంటే డ్రమ్స్‌ను స్టిక్స్ వాయిస్తుంటాయి. చేతిలో గిటార్ ప్లే చేస్తుంటే మెడకు తగిలింపకున్న విజిల్, హార్మోనికా ప్లే అవుతుంటాయి. తన నడుముకు ఉన్న క్రాష్ సింబాల్స్ కూడా కాళ్ల కదలికలను బట్టి ప్లే అవుతుంటాయి. అయితే ఈ కళాశాకుడికి టిబి సోకిన కారణంగా ఊపిరితిత్తుల సామర్ధం కేవలం 40 శాతం మాత్రమే ఉందని షెహనాజ్ తెలిపారు. ఇండియాలో ఇన్ని వాయిద్యాలను ఏకకాలంలో పలికించగల కళాకారుడిని తాను మాత్రమేనని, తనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం దక్కాల్సి ఉంటుందని పీటర్ అంటున్నాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే 3.8 లక్షల మందికి పైగా వీక్షించారు. పీటర్ ట్యాలెంట్‌కు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News