Wednesday, January 22, 2025

నడిరోడ్డుపై నగ్నంగా విదేశీయుడి పరుగు.. చెట్టుకు కట్టేసిన ప్రజలు

- Advertisement -
- Advertisement -

గురుగ్రామ్: నడి రోడ్డుపై నగ్నంగా పరుగెత్తినందుకు ఒక విదేశీయుడిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ శివారుల్లోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. నైజీరియా జాతీయుడిగా అనుమానిస్తున్న ఆ వ్యక్తిని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు సెక్టార్ 10లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని మానసిక పరిస్థితి బాగా ఉంటే అతడిపై కేసు నమోదు చేస్తామని బాద్షాపూర్ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ మదన్‌లాల్ తెలిపారు.

బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సెక్టార్ 69 తులీప్ చౌక్‌లోని ప్రధాన రహదారిలో నడిరోడ్డుపై నగ్నంగా ఒక విదేశీయుడు పరుగెత్తడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆ వ్యక్తి పక్కనే ఒక గ్రామంలోకి ప్రవేశించడంతో గ్రామస్తులు అతడిని పట్టుకుని చెట్టుకు కట్టేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఆ విదేశీయుడిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News