Monday, December 23, 2024

చీటింగ్ కేసులో సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్లేయర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎపికి చెందిన క్రికెట్ ప్లేయర్ నాగరాజు చీటింగ్ కేసులో అరెస్టయ్యాడు. నాగరాజు బుడుమూరు గతంలో రంజీ మ్యాచ్ లలో ఆడాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున కూడా ప్రాతినిథ్యం వహించాడు. ముంబైకి చెందిన వ్యాపారికి ఫోన్ చేసి వర్ధమాన క్రికెటర్, ఆంధ్రప్రదేశ్ రంజీ ఆటగాడు రికీ భుయ్ కు రూ. 12 లక్షల స్పాన్సర్ కావాలని కోరిన కేసులో నాగరాజును ముంబై సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

ఎపి సిఎం వ్యక్తిగత సహాయకుడినంటూ వ్యాపారిని బురిడీ కొట్టించిన నాగరాజు, నేషనల్ క్రికెట్ అకాడమీ, ఎపి క్రికెట్ అసోసియేషన్, రికీభుయ్ ల పేర్లు వాడుకుని సొమ్ముని కాజేశాడు. పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించిన నాగరాజు. కాగా ఎంబిఎ చదువుకున్న నాగరాజు 2014-2016 మధ్యలో ఎపి జట్టుకు (రంజీ ట్రోఫీ మ్యాచ్ లలో),2016-2018 మధ్యలో ఐపిఎ ల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, ఇండియా-బి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News