Friday, December 20, 2024

మహిళా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

- Advertisement -
- Advertisement -

ఇంట్లో మహిళా ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు అంతా ఆరోగ్యంగా ఉంటుంది.
మహిళా యోగా సాదకులకు యోగా మ్యాట్స్ కానుకగా అందించిన మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట : మంత్రి హరీశ్‌రావు మహిళా ఆరోగ్యంపైన ప్రత్యేక దృష్టి పెడుతున్నారని మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు అన్నారు. మహిళా యోగ సాదకులకు యోగా మ్యాట్స్‌ను కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… గత 15 రోజులుగా జరుగుతున్న ఉచిత యోగా శిక్షణ ముగింపు కార్యక్రమానికి విజయవంతంగా ముగిసిందన్నారు. యూటీఎంఎ, వ్యాసమహర్షి ,యోగా సోసైటి వారి సంయుక్త ఆధ్వర్యంలో దాదాపు 150 మంది మహిళా యోగ సాదన చేశారు.

బుధవారం రోజు సాయంత్రం 6.30 నుండి 7.30 వరకు యోగా సాదన చేశారు. శిక్షణా కాలంలో అనేక మంది ప్రముఖులతో పాటు మంత్రి హరీశ్‌రావు మద్యలో శిభిరాన్ని సందర్శించారు. ఇంతమంది మహిళలు యోగ సాదన దీక్షగా చేయడాన్ని చూసి మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. మహిళా ఆరోగ్యంపైన ప్రత్యేక దృషి పెడుతున్నాను ఆదిశగా ఇంత మంది మహిళలు క్యాంపు కార్యాలయాన్ని మహిళా ఆరోగ్యం కోసం ఉపయోగించుకోవడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. రోజు యోగా సాదన చేసి ఆరోగ్యం కాపాడుకుంటామనే హమీ ఇవ్వాలన్నారు.

ముగింపు కార్యక్రమంలో 250 వరకు మ్యాట్స్ పంచి మహిళా ఆరోగ్యం పట్ల వారికున్న అంకితభావాన్ని చాటుకున్నారు. అనంతరం ముఖ్య వక్తగా డాక్టర్ మాలతి మాట్లాడుతూ ఆహారంతో మహిళా ఆరోగ్యానికి ఉన్న అవినాభావ సంబందాన్ని చక్కగా తెలియజేశారు. ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు అంతా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఎందుకంటే మహిళలకు ఆరోగ్యం బాగాలేకపోతే ఏ పని కూడా సరిగ్గా చేయలేరు. ఇంటి పని అంతా కుటుంబ బారాన్నంతా మహిళనే చూస్తుందన్న విషయం మనందరికి తెలుసుకానీ ఈ రోజు అలాంటి మహిళ ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద వహిస్తుంది. ఆహారం పట్ల శ్రద్ద వహించట్లేదన్నారు. చిన్న వయస్సులోనే రోగాలు వస్తున్నాయన్నారు. వీటన్నింటికి దూరంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు ప్రతి రోజు వ్యాయామం కోసం కొంత సమయాన్ని కేటాయించడంతో పాటు ఆహార విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటించాలన్నారు.

15 రోజులుగా మహిళలకు యోగా శిక్షణ ఇస్తున్న తోట సంద్యా , సతీష్ యొక్క ఆధ్వర్యంలో మహిళల యోగా ప్రదర్శనతో పాటు జలనేత్రి, సూత్ర నేత్రి యోగా ప్రక్రీయలు వేదికపై ప్రదర్శించి అందర్ని ఆశ్చర్యపరిచారు. అనంతరం శిభిర నిర్వహకులు యూటిఎంఎ రాష్ట్ర అద్యక్షుడు లక్కిరెడ్డి విజయ శుభాకర్‌రెడ్డి, వ్యాసమహర్షి యోగా సోసైటి అద్యక్షులు నిమ్మ శ్రీనిఆవస్‌రెడ్డి, యోగ శిక్షకులు తోట సతీష్ మాట్లాడారు. అనంతరం మ్యాట్‌లను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కొండం కవిత సంపత్‌రెడ్డి యూటీఎంఎ బాద్యులు ఉమా సురేషన్‌రెడ్డి, కళా కిరణ్, స్వప్న, అంజయ్య, చిప్ప ప్రభాకర్, సుషేన హాస్పిటర్ డైరెక్టర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News