Friday, December 20, 2024

విద్యార్థి ఆత్మహత్య.. శవాన్ని చూసి ఇంటి యజమాని గుండెపోటుతో మృతి

- Advertisement -
- Advertisement -

నూస్ డెస్క్: పరీక్ష ఒత్తిడి కారణంగా పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి గదిలో సీలింగ్ ఫ్యానుకు ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడగా మృతదేహాన్ని చూసిన ఇంటి యజమాని గుండెపోటుతో మరణించాడు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.

ధోల్‌పూర్‌లోని మాధవానంద్ కాలనీలో ఒక ప్రైవేట్ స్కూలులో పదవ తరగతి చదువుతున్న పుష్పేంద్ర రాజ్‌పుత్ ఒక గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. బుధవారం తన స్వగ్రామం నుంచి తిరిగివచ్చిన అతను రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి యజమానులలో ఒకరైన బహదూర్ సింగ్(70) గదిలో ఫ్యానుకు వేళ్లాడుతున్న బాలుడి శవాన్ని చూసి సహాయం కోసం గట్టిగా కేకలు వేశాడు. హఠాత్తుగా కుప్పకూలిపోయి గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు చెప్పారు.
విద్యార్థి గదిలో సూసైడ్ నోట్ లభించినట్లు పోలీసులు చెప్పారు. రెండు శవాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News