లండన్ : ప్రపంచస్థాయిలో అత్యుత్తమ విమానాశ్రయంగా సింగపూర్‌లోని చాంగీ ఎయిర్‌పోర్టు నిలిచింది. ఇప్పటివరకూ రెండేళ్లుగా ఈ టాప్ ఒన్ స్థానంలో ఉన్న దోహా హమాద్ ఎయిర్‌పోర్టు ఈసారి రెండో స్థానంలోకివెళ్లింది. 2023 సంవత్సరానికి ఉత్తమ ఎయిర్‌పోర్టుల జాబితాను సకల ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్టు అవార్డులను ప్రకటించారు. రెండో స్థానంలో దోహాలోని హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిలచింది. మూడవ స్థానంలో టోక్యోకు చెందిన హనెడా ఎయిర్‌పోర్టు ఉంది. టాప్ టెన్‌లో అమెరికాకు చెందిన ఏ విమానాశ్రయం కూడా నిలవలేదు. ప్రయాణికులు తమకు దక్కిన ఏర్పాట్లుకు సంతృప్తిని వ్యక్తం చేయడాన్ని బట్టి స్కైట్రాక్స్ ఎయిర్‌పోర్టు అవార్డులను ఖరారు చేస్తున్నారు.
వినియోగదారుల నుంచి సంతృప్తి మేరకు వరుసగా 20 స్థానాలలో నిలిచిన ఎయిర్‌పోర్టుల పేర్లు ఇవే ః. 1) సింగపూర్ ఛాంగీ.2 )దోహా హమాద్ 3) టోక్యో హనేడా 4సియోల్ ఇంచెన్ 5 ప్యారిస్ ఛార్లెస్ డి గాల్లె 6 ఇస్తాంబుల్ 7 మ్యూనిచ్ 8 జ్యూరిచ్ ఎయిర్‌పోర్టు 9 టోక్యో నరితా 10 మాడ్రిడ్ బరాజస్ 11 వియన్నా ఎయిర్‌పోర్టు 12 హెల్సెంకీ వాంటా 13 రోమ్ ఫియూమిసినో 14 కోపెన్‌హెగెన్ 15 కన్సాయ్ 16 సెంట్రాయిర్ నాగోయా 17 దుబయ్ విమానాశ్రయం 18 సీటెల్ టకోమా 19 మెల్‌బర్న్ 20 వాంకోవెర్ . ఇంతకు ముందు న్యూయార్క్‌లోని జెఎఫ్‌కె ఎయిర్‌పోర్టు ఇప్పుడు 88వ స్థానంలో నిలిచింది. లండన్‌లోని హీత్రో ఎయిర్‌పోర్టు ఇంతకు ముందు 9వ స్థానంలో ఉండగా ఇప్పుడిది 22వ స్థానానికి పడిపోయింది. ఛాంగీ ఎయిర్‌పోర్టుకు ఉత్తమ ఎయిర్‌పోర్టు అవార్డు రావడం ఇది 12వ సారి అని వెల్లడైంది.
ఢిల్లీ ఎయిర్‌పోర్టు దక్షిణాసియాలో టాప్
భారతదేశంలోని ఏ విమానాశ్రయం కూడా ఈసారి టాప్ 20లో స్థానం దక్కించుకోలేకపోయింది. అయితే దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దక్షిణాసియాలో అగ్రస్థాయి విమానాశ్రయంగా పేరు దక్కించుకుంది.