Thursday, January 23, 2025

జనరల్ బిపిన్ రావత్ జ్ఞాపకార్థం రెండు ట్రోఫీలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత మొదటి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ జ్ఞాపకార్థం రెండు ట్రోఫీలు ప్రవేశ పెట్టినట్టు భారత నేవీ గురువారం ప్రకటించింది. దివంగత రావత్ 65వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ ట్రోఫీలు ప్రకటించింది.

మొదటి ట్రోఫీ మహిళా అగ్నివీర్ శిక్షణ అభ్యర్థుల్లో మొత్తం ప్రతిభ చూపించి మొదటి స్థానం వచ్చిన వారికి ఇస్తారు. రెండవ ట్రోఫీ గోవా నావల్ వార్ కాలేజీ (ఎన్ డబ్లు సి)లో నౌకాదళ ఉన్నత కమాండ్ కోర్సులో ఉన్నవారికి ఇస్తారు. మొదటి ట్రోఫీ మార్చి 28న నేవీ అగ్నివీర్ మొదటి బ్యాచ్ పెరేడ్ సందర్భంగా నేవీ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ బహూకరిస్తారని నేవీ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వాల్ బుధవారం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News