- Advertisement -
ముంబై: మహారాష్ట్రలో హెచ్3ఎన్2, కొవిడ్19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో అలర్ట్ ప్రకటించారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి సమక్షంలో నిన్న ఆరోగ్య శాఖ సమావేశం జరిగింది.
‘హెచ్3ఎన్2 వైరస్ రాష్ట్రంలో వ్యాపిస్తోంది, కానీ భయపడాల్సిన పనిలేదు. ప్రజలు జనసమర్ధ ప్రదేశాలలో మాస్కులు ధరించాలి, దూరం పాటించాలి, చేతులు కడుక్కోవాలి. రాష్ట్రంలో హెచ్3ఎన్2, కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఒకవేళ జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే డాక్టరును సంప్రదించండి’ అని ఆరోగ్య శాఖ మంత్రి తానాజీ సావంత్ తెలిపారు.
- Advertisement -