- Advertisement -
హైదరాబాద్: ప్రశ్నాపత్రాల లీకేజీ దృష్యా టీఎస్‌పీఎస్‌సి కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన టీఎస్‌పీఎస్‌సి శుక్రవారం రద్దు చేసింది. ఏఈఈ, డీఏఓ పరీక్షలను సైతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త పరీక్ష తేదీని ప్రకటించింది. జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం నేపథ్యంలో గతేడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ తో పలు పరీక్షలను రద్దు చేసింది. ఏఈఈ, డీఏవో పరీక్షల తేదీలు త్వరలో ప్రకటించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సి వెల్లడించింది. ఇవాళ ప్రత్యేకంగా టీఎస్‌పీఎస్‌సి సమావేశమై సిట్ నివేదికను పరిశీలించింది. సిట్ నివేదిక, అంతర్గత విచారణను పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం.
- Advertisement -