Saturday, December 21, 2024

కార్పొరేటర్లకు క్రీడా పోటీలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మార్చి 23 తేదీ నుంచి 25వ తేదీ వరకు జిహెచ్ఎంసి కార్పొరేటర్లకు వివిధ క్రీడలను నిర్వహించేందుకు జిహెచ్ఎంసి ఏర్పాట్లను పూర్తి చేసింది. రెండు రోజులపాటు జరిగే 8 రకాల క్రీడా పోటీలను ఈ నెల 25న నిర్దేశించిన క్రీడామైదానాలలో నిర్వహించి, ముగింపు కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టనున్నారు. ముఖ్యంగా క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, క్యారమ్స్, టెన్నికాయిట్, మ్యూజికల్ చైర్స్ తదితర క్రీడా పోటీలు నిర్వహించబడను. ఒక్కొక్క క్రీడలను ఒక్కొక మైదానంలో నిర్వహించనున్నారు.

క్రీడలు జరిగే క్రీడా మైదనాలకు ఒక్కొక్కరిని ఇంఛార్జి అధికారులతో పాటుగా పర్యవేక్షణ అధికారులగా సంబంధిత డీసీలను జిహెచ్ఎంసి కమిషనర్ నియమించారు. క్రికెట్ పోటీలు నాగోల్ లోని ఫతుల్లగూడ డి.ఆర్.ఎఫ్ ట్రైనింగ్ సెంటర్ లో నిర్వహించనున్నట్లు జిహెచ్ఎంసి పేర్కొంది. అదేవిధంగా కబడ్డీ ఉప్పల్ స్టేడియం, వాలీబాల్ చార్మినార్ ఖులి కుతుబ్ షా స్టేడియం, శేర్లింగంపల్లి జోన్ చందానగర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్, ఖైరతాబాద్ జోన్ విక్టోరియా ప్లే గ్రౌండ్ లో క్యారమ్స్, చెస్, టెన్నికాయిట్ మ్యూజికల్ చైర్స్ క్రీడలు నిర్వహించనున్నారు. ఈ పోటీలలో కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ పాల్గొని విజయవంతం చేయాలని జిహెచ్ఎంసి కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News