Saturday, November 23, 2024

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవిఎన్ రెడ్డి విజయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి బలపర్చిన అయ్యాలపు వెంకట్ నారాయణరెడ్డి (ఎవిఎన్ రెడ్డి) గెలుపొందారు. నువ్వా నేనా అన్న రీతితో తీవ్ర ఉత్కంఠగా సాగిన పోరులో చివరికి ఆయనను విజయం వరించింది. మొదటి రౌండ్‌లో 7505 ఓట్లను సాధించిన ఆయన చివరి వరకు సమీప అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై ఆధిక్యం కొనసాగించారు. మొత్తం 29720 ఓట్లకు గాను 25,868 ఓట్లు పోల్ కాగా ఇందులో 452 ఓట్లు చెల్లని ఓట్లు ఉన్నాయి. దీంతో 25,416 ఓట్లకు గాను 13,436 ఓట్లు సాధించి గెలుపుకు మ్యాజింగ్ ఫీగర్ అయిన 12709ని అధిగమించారు. దీంతో రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలా ఎవిఎన్ రెడ్డి గెలుపును ధృవీకరిస్తూ ఆయనకు పత్రాన్ని అందజేశారు.

ఉత్కంఠ భరితంగా కౌంటింగ్
సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో జరిగిన మహబూబ్ నగర్ , రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ భరితంగా సాగింది. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం తెల్లవారు జామున 4 గంటలకు ముగిసింది. మొత్తం 21 రౌండ్లు కౌంటింగ్ కొనసాగగా, మొదటి రౌండ్‌లో అత్యధిక సాధించిన ఎవిఎన్‌రెడ్డి దానిని చివరి రౌండ్ వరకు కొనసాగించడంతో ఆయనను విజయం వరించింది. మొదటి రౌండ్‌లో ఎవిఎన్‌రెడ్డికి మొదటి రౌండ్‌లో 7505 ఓట్లు రాగా, గుర్రం చెన్నకేశవరెడ్డికి 6584 ఓట్లు వచ్చాయి.

చివరి వరకు వీరి ఇద్దరు మధ్యే పోరు కొనసాగింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్‌రెడ్డికి మొదటి రౌండ్‌లో కేవలం 1236 ఓట్లు రాగా, కాంగ్రెస్ మద్దతిచ్చిన గాల్‌రెడ్డి హర్షవర్ధన్ రెడ్డికి 1907 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా యుటిఎఫ్ బలపర్చిన పాపన్నగారి మాణిక్‌రెడ్డికి 4569 ఓట్లు, ఎస్‌టియు బలపర్చిన బి. భుజంగరావుకు 1103 ఓట్లు వచ్చాయి. మొత్తం 21 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేయగా వీరు మినహా మిగిలిన 15 మందిలో 6 మంది ట్రిబుల్ డిజిట్ దాటగా మరో 7 మంది డబుల్ డిజిట్, ఇద్దరు కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమైయ్యారు.

సంఘాల అతీతంగా పని చేస్తా : ఎవిఎన్‌రెడ్డి
విద్యారంగం సమస్యల పరిష్కారానికి తనవంతుగా ఎనలేని కృషి చేస్తానని ఉపాధ్యాయ్య ఎమ్మెల్సీ విజేత అయ్యాలపు వెంకట్ నారాయణరెడ్డి అన్నారు. అందరి సహాయ సహకారాల వల్లే తను గెలుపు సాధించానని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయలందరూ సంఘాలకు అతీతంగా ఓట్లు వేసి గెలిపించారని వారందరిని కలుపుకుని ముందుకు సాగుతానని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News