Monday, December 23, 2024

అకాల వర్షాలతో రైతన్న కష్టం నేలపాలు

- Advertisement -
- Advertisement -

రాయికల్‌ః జగిత్యాల జిల్లా రాయికల్  మండలంలోని పలు గ్రామాల్లో గురువారం రాత్రి ఈదురు గాలుల వర్షానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాయికల్ మండల పరిధిలోని రామాజీపేట, రాయికల్, భూపతిపూర్, మూటపెల్లి, ఒడ్డెలింగాపూర్, అల్లీపూర్, మైతాపూర్, కుమ్మరిపెల్లి, ఆలూర్ తదితర గ్రామాల్లో కురిసిన ఈదురు గాలుల వర్షానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

మామిడితోటల్లో పూత నేలవాలగా, మొక్కజొన్న, నువ్వు పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News