Monday, December 23, 2024

స్వప్నలోక్ అగ్ని ప్రమాదంలో మర్రిపల్లి యువతి మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/దుగ్గొండి: స్వప్న లోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో వరంగల్ జిల్లాకు చెందిన యువతి మృతిచెందింది. 5వ అంతస్తులో ఉన్న ఈ కామర్స్ కాల్ సెంటర్ సంస్థలో పనిచేస్తున్న దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన వంగ రవి కుమార్తె వంగ వెన్నెల గురువారం జరిగిన అగ్ని ప్రమాదంతో సంభవించిన దట్టమైన పొగతో ఊపిరాడక అర్ధరాత్రి మృతిచెందింది. కాగా వెన్నెల గత మూడేళ్లుగా ఈ కామర్స్ సంస్థలో పని చేస్తుంది. కుటుంబానికి ఆసరాగా ఉండాలని ఉద్యోగం చేస్తున్న వెన్నెలను అగ్ని ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. ఒక్కగానొక్క కుమార్తె మృతిచెందడంతో రవి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News