- Advertisement -
మనతెలంగాణ, హైదరాబాద్ : చోరీకి గురైన ఆటోను జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఎస్సై టి. శ్రీధర్ సిబ్బందితో కలిసి నీరూస్ జంక్షన్ వద్ద శుక్రవారం వాహనాల తనిఖీ నిర్వహించాడు. వాహనాలను తనిఖీ చేస్తుండగా టిఎస్ 34 టి 5868 నంబర్ ఆటో రావడంతో ఆపి తనిఖీ చేశారు.
ఈ ఆటో నవంబర్, 2019లో కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైనట్లు గుర్తించారు. ఆటోను నడుపుతున్న కూకట్‌పల్లికి చెందిన ముడావత్ సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలించిన పోలీసులు, కెపిహెచ్‌బి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి పోలీసులు రాగానే ఆటోను చోరీ చేసిన డ్రైవర్‌తో పాటు ఆటోను వారికి అప్పగించారు.
- Advertisement -