- Advertisement -
హైదరాబాద్:టిఎస్ పిఎస్సి పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ బిజెపి నేతలు గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం రాజ్ భవన్ కు వెళ్లిన బిజెపి నేతలు, గవర్నర్ కు వినతి పత్రం అందజేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పేపర్ లీకేజీ వ్యవహారంపై బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఐటి మంత్రి కెటి రామారావులు తమ పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే, టిఎస్ పిఎస్సి చైర్మెన్ తోపాటు సభ్యులను తొలిగించి కొత్త కమిషన్ ను నియమించాలని డిమాండ్ చేశారు.
- Advertisement -