Tuesday, November 5, 2024

ఐదు భాషలలో ఒకే పాట..సిక్కు యువకుడి నోట(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని, ఘన వారసత్వ సంపదను, అద్భుతంగా ఆవిష్కరించిన గీతంగా మిలే సుర్ తేరా హమారా నిలిచిపోతుంది. 90వ దశకంలో దూరదర్శన్‌లో తరచు దర్శనమిచ్చిన ఈ గీతంలో భారతదేశంలోని వివిధ భాషలు వినిపిస్తాయి. అదే తరహాలో తాజాగా ఒక సిక్కు యువకుడు ఆలపించిన మరో గీతం ప్రధాని నరేంద్ర మోడీ నుంచి సైతం ప్రశంసలు దక్కించుకుంది.

బ్రహ్మాస్త్ర చిత్రంలోని కేసరియా పాటను ఐదు వేర్వేరు భాషలలో ఆలపించాడు సత్‌బీర్ సింగ్ అనే యువకుడు. మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు, హిందీ భాషలలో పాడిన ఈ పాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్ల హృదయాలను సైతం హత్తుకుంటోంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్పూర్థికి ఈ మధురమైన గీతం నిదర్శనమని ప్రధాని మోడీ కితాబునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News