Saturday, November 23, 2024

155 నోటిఫికేషన్‌లు.. 37 వేల ఉద్యోగాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన తర్వాత 155 నోటిఫికేషన్లు విడుదల అయ్యాయని 37 వేల ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేశామని మంత్రి కెటిఆర్ తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒకే సారి 10 లక్షల మందికి పరీక్ష నిర్వహించి ‘దేశంలోనే అత్యుత్తమ పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో ఒకటిగా టిఎస్ పీఎస్సీ పేరుగాంచింది. ఎన్నో రకాల సంస్కరణలు, భాగంగానే మార్పులు, కాలానుగుణంగా సాంకేతికతను జోడించి కీలక నిర్ణయాలతో ముందుకెళ్తంది. అందులో ఓటిఆర్‌ను తీసుకొచ్చింది. డిజిటల్ చెల్లింపు ద్వారా ఫీజు తీసుకున్నాం. కంప్యూటర్ ఆధారిత టెస్టును నిర్వహించే దానికి శ్రీకారం చుట్టింది.

సిబిటి విధానంలో భాగంగా 99 పరీక్షలను నిర్వహించగా 4.5 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో అనేక చర్యలు చేపట్టాం. సాంకేతికత, డిజిటలైజేషన్ ద్వారా అనేక పద్ధతులు తీసుకొచ్చింది. యూపీఎస్సీ ఛైర్మన్ రెండుసార్లు రాష్ట్రానికి వచ్చి టిఎస్పీఎస్సీని సందర్శించి ఇక్కడి మార్పులు, చేర్పులను ఎలా వినియోగించుకోవచ్చనే అంశంపై అధ్యయనం చేసి వెళ్లారు. దేశంలోని 19 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు, సభ్యులు ఇక్కడికి వచ్చి మనం తీసుకొచ్చిన మార్పుల్ని అధ్యయనం చేసి వారి రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఎనిమిదేళ్లలో రాష్ట్రం పాత ధోరణులకు తావు ఉండొద్దనే నిరుద్యోగ యువకులకు ఇంటర్వ్యూ రద్దు చేశాం’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News