Saturday, April 5, 2025

సరదాగా ఈతకు వెళ్లి ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

తానూర్ : బావిలో ఈతకు వెళ్లి ఒకరు మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని నాందెడ్‌కు చెందిన మొహమ్మద్ జియా (30) తన అత్తగారింట్లో మరదలు ఎంగెజ్‌మెంట్ కోసం శుక్రవారం తానూర్‌కు వచ్చాడు. శనివారం మధ్యాహ్నం వేళలో బంధువులు ముగ్గురితో కలిసి ధర్మాబాద్ రోడ్డుకు గల వ్యవసాయ బావిలో ఈత కోసం వెళ్లాడు.

ట్యూబ్ శరీరానికి తగిలించుకొని ఈత నేర్చుకోవడానికి వెళ్లగా ట్యూబ్ శరీరం నుండి వేరు కావడంతో నీటిలో మునిగి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ విక్రమ్ సంఘటన స్థలానికి వెళ్లి బావిలో గత ఈతగాళ్లతో గాలించి మృతదేహన్ని బయటకు తీశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News