- Advertisement -
చింతకాని:విద్యుత్ షాక్‌తో భార్య భర్తలు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో చోటు చేసుకుంది. మండలంలో వందనం గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు రాములు ఆయన భార్య రంగమ్మలు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు సమాచారం. వర్షం కురిసిన తరువాత పొలంలో గొర్రెలను కాస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి అక్కడికి అక్కడే మృతి చెందారు.
- Advertisement -