హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని స్వప్పలోక కాంప్లెక్స్ ఘటన దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. భవనాల యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం దారుణమని చెప్పారు. ప్రతి ఘటనలో పేదలు, అమాయకుల ప్రాణాలు పోతున్నాయని, ప్రమాదాలకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. గోదాములు, స్క్రాప్ దుకాణాలను అధికారులు తనిఖీ చేయడంలేదని విమర్శించారు. ప్రమాదకార గోదాములను శివారు ప్రాంతాలకు తరలించాలన్నారు. సిబ్బంది తక్కువగా ఉన్నారని అగ్నిమాపక శాఖ చెబుతోందని, అగ్నిమాపక శాఖకు కొత్తగా వచ్చిన పరికరాలను సమకూర్చాలన్నారు. ప్రభుత్వం ఆదాయం కోసం అక్రమ భవనాలను క్రమబద్ధీకరిస్తోందని, ఎక్కువ ఆదాయం వస్తోందని అక్రమ నిర్మాణాలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చే సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డబ్బులు అడిగే సంస్థల గురించి యువత తమకు సమాచారం ఇవ్వాలన్నారు.
అక్రమ భవనాలను క్రమబద్ధీకరించవద్దు : కిషన్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -