- Advertisement -
విశాఖపట్నం: రెండో వన్డేలో టీమిండియాపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింద. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా బ్యాట్స్ మెన్లకు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడడంతో వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో భారత్ కేవలం 26 ఓవర్లలోనే 117 పరుగులకే చేతులెత్తేసింది.
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఓపెనర్స్, టీమిండియా బౌలర్లను హడలెత్తించారు. ఫోర్లు, సిక్సులతో మెరుపులు మెరించారు. మిచెల్ మార్ష్(66 నాటౌట్), ట్రావిస్ హెడ్(51 నాటౌట్) అర్ధ శతకాలతో చెలరేగారు. వీరి ధాటికి టీమిండియా బౌలర్లు కూడా చెేతులెత్తేయడంతో వార్ వన్ సైడ్ అయిపోయింది. దీంతో 11 ఓవర్లలోనే ఆసీస్ 10 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్ ను 1-1తో ఆసీస్ సమం చేసింది.
- Advertisement -