Sunday, November 24, 2024

యుపి విద్యుత్ సిబ్బంది సమ్మె విరమణ

- Advertisement -
- Advertisement -

లక్నో : ఉత్తరప్రదేశ్ విద్యుత్ సిబ్బంది డిమాండ్ల సాధన కోసం సాగిస్తున్న సమ్మెను 65 గంటల తరువాత ఆదివారం విరమించారు. విద్యుత్ సిబ్బంది నాయకులు, రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి ఎకె శర్మ మధ్య మూడోసారి జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో సమ్మెకు తెరపడింది. సంఘర్ష్ సమితి కన్వీనర్ శైలేంద్ర దూబే ఈమేరకు సిబ్బంది మళ్లీ విధులకు హాజరవుతారని ప్రకటించారు.

సమ్మెను విరమించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని గౌరవిస్తూ ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ ఇచ్చిన పిలుపుపై మంత్రి శర్మ హామీ ఇవ్వడంతో సమ్మె విరమణ అయిందని దూబే చెప్పారు. అత్యవసర సర్వీసుల చట్టం కింద తొలగించిన 22 మంది, కేసులు నమోదైన 29 మందితోపాటు , విధుల నుంచి తొలగించిన మొత్తం 3000 మందిని తిరిగి విధుల్లోకి చేర్చుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే మంత్రి లిఖిత పూర్వకంగా ఎలాంటి హామీ సిబ్బందికి ఇవ్వలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News