ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే, శ్రీలీలలు హీరోయిన్లుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు మహేష్ కెరీర్‌లో ఏ సినిమాకి పెట్టనంత భారీ బడ్జెట్, భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో అయితే ఈ సినిమాని మేకర్స్ ప్లాన్ చేశాడు. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతున్న ఈ సినిమా సెట్స్ నుంచి ఓ సూపర్ కూల్ పిక్ ఒకటి బయటకి వచ్చి వైరల్‌గా మారింది. ఇందులో మహేష్ సూపర్ స్లిమ్‌గా, హ్యాండ్సమ్‌గా కనిపిస్తుండగా నటుడు జైరాం కూడా ఇందులో కనిపించారు.
ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. ఎస్‌ఎస్‌ఎంబి 28 అనే వర్కింగ్ టైటిల్‌తో సెట్స్ పైకి వెళ్లిన మహేశ్ -త్రివిక్రమ్ సినిమాకి ‘ఆరంభం’, ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్స్‌ని చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు టాక్ తెలిసింది. త్రివిక్రమ్‌కి ఉన్న ‘అ’, ‘ఆ’ సెంటిమెంట్‌ని ఫాలో అవుతూ ‘ఆరంభం’, అయోధ్యలో అర్జునుడు’ టైటిల్స్ లో ఒకదాన్ని ఫైనల్ చేస్తాడని ఫాన్స్‌లో చర్చ నడుస్తుంది. ఉగాది రోజున ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేసి, ఆ రోజే టైటిల్‌ని కూడా మేకర్స్ ప్రకటిస్తారని సమాచారం.