Thursday, January 2, 2025

మందుకొట్టి మండపానికి రాని వరుడు..పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: పెళ్లి పీటలు ఎక్కకు ముందే పెళ్లిళ్లు పెటాకులవుతున్న ఉదంతాలు ఇటీవల పెరుగుతున్నాయి. అటువంటి సంఘటనే తాజాగా బీహార్‌లో చోటుచేసుకుంది. పెళ్లికి ముందురోజు పూటుగా తాగిన వరుడు మరుసటి రోజు తన పెళ్లి విషయమే మరచిపోయి వొళ్లు తెలియకుండా నిద్రపోగాఈ తాగుబోతు వరుడు వద్దంటూ పెళ్లినే రద్దు చేసుకుంది వధువు.
ఇక బ్రహ్మచారి జీవితానికి ముగింపు వచ్చిందన్న ఆనందంతో వరుడు పెళ్లికి ముందురోజు రాత్రి తన మిత్రులతో కలసి బ్యాచిలర్స్ పార్టీ చేసుకున్నాడు. బాగా మందుకొట్టి తెల్లారెప్పుడో నిద్రపోయాడు. నిద్రలేచి చూసేసరికి సాయంత్రం అయిపోయింది. అప్పుడు తీరిగ్గా పెళ్లి మండపానికి వెళ్లేసరికి ఎవ్వరూ కనపడలేదు. వధువు ఇంటికి వెళ్లి చూడగా తన బంధువులంతా అక్కడ బందీగా ఉన్నారు. తాగుబోతును పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని వధువు తెగేసి చెప్పడమేగాక తాము పెళ్లి కోసం చేసిన ఖర్చును అణాపైసల్తో సహా కక్కాలంటూ భీష్మించుకు కూర్చుంది. పోలీసులు జోక్యం చేసుకున్నా ఎటువంటి ఫలితం కనపడలేదు. పెళ్లి రద్దు చేసుకుని, పెళ్లి ఖర్చుల డబ్బు చెల్లించేసి వరుడి బంధువులు అక్కడి నుంచి ఎలాగోలా బయటపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News