Monday, November 25, 2024

అమృత్‌పాల్ సింగ్ కోసం ఇప్పటికీ కొనసాగుతున్న వేట!

- Advertisement -
- Advertisement -
పంజాబ్‌లో ఇంటర్నెట్ సస్పెన్షన్ పొడగింపు!

జలంధర్: పంజాబ్ ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్ సర్వీసుల రద్దును మంగళవారం మధ్యాహ్నం వరకు పొడగించింది. ఇప్పటికీ చిక్కకుండా ఉన్న ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ కోసం వేట కొనసాగుతోంది. “పంజాబ్ ప్రాదేశిక అధికార పరిధిలో అన్ని మొబైల్ ఇంటర్నెట్ సేవలు, అన్ని ఎస్‌ఎంఎస్‌లు(బ్యాంకింగ్, మొబైల్ రీచార్జ్ మినహా), డాంగిల్ సేలు, వాయిస్ కాల్ మినహా మార్చి 21(మధ్యాహ్నం 12.00 గంటలు) వరకు నిషేధించబడ్డాయి” అని హోమ్ అఫైర్స్ అండ్ జస్టిస్ శాఖ, పంజాబ్ ప్రభుత్వం తెలిపింది.

“అమృత్‌పాల్ నేతృత్వం వహిస్తున్న వారీస్ పంజాబ్ దే శక్తులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా దిగ్బంధం, వెతుకులాట (సిఎఎస్‌ఓ) చేపట్టాం” అని పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా ఈ రోజు అమృత్‌పాల్ సింగ్ అంకుల్, డ్రయివర్ జలంధర్ పోలీసుల ముందు లొంగిపోయారు. కాగా ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News