న్యూఢిల్లీ: మోసగించిన బిజెపి ప్రభుత్వంపై మలి దశ పోరాటానికి రైతాంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కెఎం) సోమవారం ‘కిసాన్ మహాపంచాయత్ ’ నిర్వహిస్తున్నది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, ఇతర హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్రోహానికి పాల్పడటంపై రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. రైతుల కష్టాలు తీర్చేందుకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేసింది. 11 రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీకి రావడం శనివారం నుంచే ప్రారంభమైందని అక్కడి పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా రైతులు చేస్తున్న ప్రధాన డిమాండ్లు ఇవి: 1.కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి, 2.రైతులకు రుణ మాఫీ చేయాలి, 3.విద్యుత్తు సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి, 4.వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తు ఇవ్వడంతో పాటు, గ్రామీణ కుటుంబాలకు 300 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలి, 5.రైతాంగ ఉద్యమంలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి, 6.రైతులపై పెట్టిన కేసులను వెనక్కు తీసుకోవాలి.
కేంద్రం మోసంపై రైతుల పోరుబాట
- Advertisement -
- Advertisement -
- Advertisement -