Friday, November 15, 2024

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్.. రేవంత్‌కు సిట్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సిట్ అధికారులు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి సోమవారం నోటీసులు పంపారు. టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నాపత్రం కేసులో ఆయన చేసిన విమర్శల నేపథ్యంలో సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటికి సిట్ అధికారులు, జూబ్లీహిల్స్ పోలీ సులుు చేరుకున్నారు. హత్ సే హత్ జోడో అభియాన్ యాత్రలో భాగంగా ఆయన పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నిజామా బాద్ జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగుతుంది.

ఇంట్లో లేకపోవడంతో సిట్ అధికారులు ఆయన నివాసానికి నోటీసులు అంటించి వెళ్లారు. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజ్ కేసులో అరెస్టైన రాజశేఖర్‌రెడ్డికి చెందిన మండలంలో గ్రూప్-1 పరీక్షల్లో వెయ్యి మంది ఉత్తీర్ణులయ్యారని ఆరోపించారు. ఈ విషయమై తమకు సమాచారం ఇవ్వాలని ఆయనను సిట్ అధికారులు కోరే అవకాశం ఉంది. ఈ విషయమై విమర్శలు చేసిన రాజకీయ నాయకులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయను న్నారు. టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నాపత్రం లీక్‌కు సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారం ఇవ్వాలని రాజకీయ నేతలను సిట్ అధికారులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News