Friday, December 20, 2024

చట్టోగ్రామ్, సిల్హెట్ పోర్టులను వినియోగించుకోండి

- Advertisement -
- Advertisement -

ఢాకా: కోరుకుంటే బంగ్లాదేశ్‌లోని చట్టోగ్రామ్, సిల్హెట్ పోర్టులను వినియోగించుకోవచ్చని బంగ్లాప్రధాని షేక్ హసీనా తెలిపారు. ఈ విషయాన్ని కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ సభ్యుడు బంగ్లా ప్రధాని తన అధికారిక నివాసం గణభబన్‌లో తెలిపారు. బంగ్లాదేశ్ వార్తా సంస్థ సంగ్‌బాద్ సంస్థ (బిఎస్‌ఎస్) నివేదిక ప్రకారం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్యం, ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరుచుకునేందుకు బంగ్లా ప్రధాని హసీనా ఈ నిర్ణయం తీసుకున్నారు.

బంగ్లాదేశ్ ఆగ్నేయ తీరంలో ఉన్న ఓడరేవు నగరం చట్టోగ్రామ్‌ను చిట్టగాంగ్ అని పిలుస్తారు. తూర్పు బంగ్లాదేశ్‌లోని సుర్మా నదిపై సిల్హెట్ నగరం ఉంది. ఇది సూఫీ క్షేత్రాలకు ప్రసిద్ధి చెందింది. కాగా భారత్‌బంగ్లా ఫ్రెండ్‌షిప్ పైపులైన్ రూ.377కోట్ల అంచనా వ్యయంతో నిర్మితమైంది. ఈ పైపులైన్ నిర్మాణానికి అవసరమైన సగానికి పైగా నిధులును భారత్ సమకూర్చింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య బలోపేతం చేయడం లక్షంగా ఈ పైపులైన్ నిర్మించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News