Monday, December 23, 2024

‘ఎన్‌బికె 108’ షూటింగ్‌లో..

- Advertisement -
- Advertisement -

నటసింహ నందమూరి బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ ప్రా జెక్ట్ ‘ఎన్‌బికె 108’. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల చాలా కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ నెల ప్రారంభంలో సినిమా షూటింగ్‌లో ఆమె చేరింది. ఏజ్‌లెస్ బ్యూటీ కాజల్ అగర్వాల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోందని మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. సో మవారం ఆమె హైదరాబాద్‌లో షూటింగ్‌లో చేరింది. బాలకృష్ణతో కాజల్ నటిస్తున్న మొదటి ఇది కావడం విశేషం. బాలకృష్ణ, కాజల్ ఒకరిని మరొకరు పిడికిలితో షేక్ హ్యాండ్స్ ఇస్తున్నట్లుగా కనిపిస్తున్న ఫోటోని మేకర్స్ షేర్ చేశారు. బాలకృష్ణ మునుపెన్నడూ చూడని పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News