Friday, November 22, 2024

నిమ్స్‌లో నర్సుల మెరుపు సమ్మె

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇన్‌ఛార్జి డైరెక్టర్ వేధిస్తున్నాడంటూ నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లోని నర్సులు మెరుపు సమ్మె(ఫ్లాష్ స్ట్రయిక్)కు దిగారు. అదనపు విధులు అంటగడుతూ ఆ అధికారి వేధిస్తున్నాడని వారు తమ విధులను బహిష్కరించారు. దాంతో సోమవారం రాత్రి నుంచే ఆరోగ్య సేవలు ప్రభావితం అయ్యాయి. వారంతా ఆసుపత్రి ఆవరణలో బైఠాయింపు నిరసన చేపట్టారు. తమ డిమాండ్‌లను నెరవేర్చాలంటూ వారు ఈ బైఠాయింపుకు దిగారు. అదనపు విధులు పెడుతూ ఇన్‌ఛార్జి డైరెక్టర్ తమపై పనిభారాన్ని పెంచుతున్నారని వారు తెలిపారు.

నర్సులు చేపట్టిన మెరుపు సమ్మెతో ఆరోగ్య సేవలు ప్రభావితం అయ్యాయి. వారు విధులను బహిష్కరించడంతో ఇన్‌పేషంట్లు, అవుట్ పేషంట్లు అవస్థలు పడుతున్నారు. నర్సులు సమ్మె చేస్తుండడంతో డాక్టర్లు సైతం తమ సర్జరీలను వాయిదా వేసుకున్నారు. కాగా నర్సుల డిమాండ్ల విషయమై ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ చర్చలు జరపాలనుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News