Monday, December 23, 2024

పర్వత ప్రాంత అడవుల అదృశ్యం

- Advertisement -
- Advertisement -

2000 సంవత్సరానికి ప్రపంచం మొత్తం మీద 2.71 బిలియన్ ఎకరాల్లో పర్వత ప్రాంత అడవులు విస్తరించి ఉండగా, 2000 నుంచి 2018 మధ్యకాలంలో కనీసం 78.1 మిలియన్ హెక్టార్ల వరకు అమెరికా లోని టెక్సాస్ రాష్ట్రం కన్నా ఎక్కువ విస్తీర్ణంలో కోల్పోవడం జరిగింది. శతాబ్దం ఆరంభం కన్నా ఇటీవల 2.7 రెట్లు నష్టం జరిగింది. అడవులను దహనం చేసే దావానలం, సాగులో మార్పులు, వాణిజ్యపరమైన అడవులు, తదితర సంఘటనలు పర్వత ప్రాంత అడవులు క్షీణించడానికి దోహదం చేస్తున్నాయి. అడవులు వాణిజ్యపరంగా 42 శాతం వరకు మారాయి. అడవులు కార్చిచ్చుకు 29 శాతం గురవుతున్నాయి.

సాగులో మార్పిడి 15 శాతం వరకు జరుగుతోంది. ఉష్ణమండల ప్రాంతాల్లో పర్వత ప్రాంత అడవులు వేగంగా అంతరించి పోతున్నాయి. ఈ అడవుల్లో జీవ వైవిధ్యం చాలా ఎక్కువగా ఉండడంతో ప్రభావం భారీగా ఉంటోంది. అడవుల్లో గిరిజనులు వంటి తెగల ప్రజలను నివసించడానికే ప్రభుత్వాలు అనుమతిస్తాయి తప్ప అడవులను నరికివేయడానికి కాదని అటవీ అధికారులు చెబుతున్నారు. ప్రపంచం మొత్తం మీక్ష్మ పక్షులు, క్షీరదాలు వంటి వన్యప్రాణులు దాదాపు 85 శాతం అడవుల్లోనే ఉంటున్నాయి.

ఇవన్నీ తుడుచుపెట్టుకుపోతున్నాయి. శాటిలైట్ డేటా ఉపయోగించి సాగించిన అధ్యయనంలో ఆసియా లోనే దాదాపు 39.8 మిలియన్ హెక్టార్ల అడవులు భారీ ఎత్తున నాశనమయ్యాయని తేలింది. ఇది ప్రపంచం మొత్తం మీద సగానికి సగం తగ్గిన్ట. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఐరోపా , ఆస్ట్రేలియాల్లో కూడా చెప్పుకోదగినంత నష్టం జరిగింది. ఎక్కువగా వీటిని కలప కోసం టార్గెట్ చేస్తున్నారు.ఇంకా వ్యవసాయం కోసం వినియోగించడం అడవులు తరిగిపోడానికి దారి చూపిస్తోంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News