Monday, December 23, 2024

రాష్ట్రపతి నిలయానికి ప్రత్యేక బస్సులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ, హైదరాబాద్: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించేందుకు సందర్శకులకు నేటి నుంచి అనుమతి ఇవ్వడంతో ఆర్‌టి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ సిహెచ్. వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టపతి నిలయం సందర్శనకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అనుమతి ఇవ్వడంతో సందర్శకుల సౌకర్యార్దం 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో సికింద్రాబాద్ నుంచి బాలాజీనగర్, సీఆర్‌పిఎఫ్,ఘటకేసర్‌కు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం మీదుగా బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు.

కంటోన్మెంట్ డిపోకు చెందిన బస్సు రూట్ నెం : 24 బి, సికంద్రాబాద్ నుంచి బాలాజీ నగర్, అదే విధంగా హకీంపేట డిపో నుంచి రూట్ 211 ఎమ్ సికింద్రాబాద్ నుంచి సిఆర్‌పిఎఫ్, 24 బి / 281 సికింద్రాబాద్ ఘటకేసర్‌కు ప్రతి రోజు 18 టిప్పులతో ప్రతి 5 నుంచి 10 నిమిషాలకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సురక్షితమైన ,సుఖవంతమైన ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణించి సంస్థ అభివృద్దికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News