Monday, December 23, 2024

ప్రేమపెళ్లి… పట్టపగలు నడి రోడ్డుపై అల్లుడిని నరికి చంపిన మామ

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని అల్లుడుని మామ అడ్డంగా నరికి చంపిన సంఘటన తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పుర్మాగామ్ కోట్టాయ్ గ్రామంలో  శంకర్ అనే వ్యక్తి ధనవంతుడు కావడంతో తన కూతురు శరణ్యను డబ్బున్నోళ్లకు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.
కిట్టమ్ పట్టి ప్రాంతంలోని చిన్నబియాన్ గ్రామానికి చెందిన జగన్, శరణ్య గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదురించి శరణ్య జగన్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది.  ఈ పెళ్లి శంకర్ కు ఇష్టం లేకపోవడంతో జగన్ ను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. జగన్ కిట్టంబట్టి ప్రాంతంలో ఓ టెక్స్‌టైల్స్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జగన్ కావేరీ పట్టణం వెళ్తున్న విషయాన్ని శంకర్‌కు తెలియడంతో కెఆర్‌పి డ్యామ్ వద్ద మాటు వేశాడు. జగన్ డ్యామ్ వద్దకు రాగానే తన బంధువులతో కలిసి కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో జగన్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. వెంటనే శంకర్ తన బంధువులతో కలిసి వెళ్లి స్థానిక కోర్టులో లొంగిపోయాడు. ఈ హత్య తమిళనాడులో కలకలం సృష్టిస్తోంది. పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News