Sunday, January 19, 2025

ప్రేమపెళ్లి… మలక్‌పేటలో కానిస్టేబుల్ వేధించడంతో భార్య ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కానిస్టేబుల్ ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మద్యానికి బానిస కావడంతో పాటు భార్యను అదనపు కట్నం తీసుకరావాలని వేధిస్తుండడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని మలక్‌పేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మేడ్చల్ జిల్లా తిరుమలగిరి ప్రాంతం ఎస్‌బిహెచ్ కాలనీలో వడ్ల శ్రీనివాస్-రేణుక దంపతుల కూతురు పవిత్ర ఉంది. పవిత్రను కానిస్టేబుల్ అవినాశ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏడు సంవత్సరాల క్రితం ప్రేమపెళ్లి జరిగింది. ఈ దంపతులకు అవిక్షిత అనే కుమార్తె (05) ఉంది. గత కొన్ని రోజుల నుంచి అవినాశ్ మద్యానికి బానిసగా మారడంతో పాటు అదనపు కట్నం తీసుకరావాలని భార్యనే వేధించేవాడు. ఆమె మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అవినాశ్ మంచిగా ఉంటానని కాపురం చేస్తానని చెప్పడంతో అత్తింటి మరో రెండు లక్షల రూపాయలు కట్టి కారు కొనిచ్చారు. ఫిబ్రవరి 20న పవిత్రతో అవినాశ్ గొడవపడడంతో ఆమె ఇంట్లో ఉరేసుకుంది. మృతురాలు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News