హైదరాబాద్: రాష్ట్రపతి నిలయం విశేషాలు ప్రజలు కూడా తెలుసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ తెలిపారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం సందర్శన ప్రారంభమైంది. పౌరుల సందర్శనను రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్రపతి నిలయంలో నాలెడ్జ్ గ్యాలరీ, కిచెల్ టన్నెల్, విజిటర్స్ ఫెసిలిటీస్ సెంటర్స్, మెట్ల బావిని ప్రారంభించారు. రాష్ట్రపతి నిలయాన్ని ఇక నుంచి అన్ని రోజులు సందర్శంచే అవకాశం ఉంది.
డిసెంబర్ మినహా అన్ని రోజుల్లో సందర్శకులకు అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే సందర్శనకు అనుమతి ఇచ్చామన్నారు. రాష్ట్రపతి నిలయం విశేషాలు నాలెడ్జ్ గ్యాలరీలో లభిస్తాయని, తెలంగాణ సంప్రదాయ కళతో కిచెన్ టన్నెల్ పుననిర్మాణం జరిగిందన్నారు. తన హయాంలో బట్టర్ ఫ్లై, రాక్, నక్షత్ర గార్డెన్స్ ప్రారంభించడం సంతోషంగా ఉందని ద్రౌపతి ముర్మూ పేర్కొన్నారు.