- Advertisement -
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటుడు ఎన్‌టిఆర్ శత జయంతి సందర్భంగా వంద రూపాయల నాణెం విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై కేంద్రం తాజాగా అధికారిక గెజిట్ జారీ చేసింది. 44 మిల్లీమీటర్లు చుట్టుకొలతతో ఉండే ఈ నాణెంలో సుమారు 50 శాతం వెండి అలాగే 40 శాతం రాగీ ఉండనుంది. అలాగే ఐదు శాతం నికెల్, ఐదు శాతం లోహాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం..మరోవైపు ఎన్‌టిఆర్ చిత్రం, దాని కింద నందమూరి తారక రామారావు శత జయంతి 1923 -2023 అని హిందీభాషలో ముద్రిస్తారు. అయితే ఈ విషయాన్ని గెజిట్‌లో స్పష్టంగా కేంద్రం ప్రభుత్వం వివరించింది. ఎన్‌టిఆర్ శతజయంతికి వంద రూపాయల కాయిన్ విడుదల పట్ల నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -