Monday, December 23, 2024

కామెడీ ఎంటర్‌టైనర్ ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

హీరో అల్లరి నరేష్ చేయబోతున్న ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కు కొత్త దర్శకుడు మల్లి అంకం దర్శకత్వం వహిస్తుండగా చిలకా ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నంబర్ 2గా రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. కథలో యూనిక్ పాయింట్ తో పాటు పూర్తి వినోదాన్ని అందించబోతున్నారు మేకర్స్. ఉగాది సందర్భంగా ఈ సినిమా ప్రారంభ వేడుకను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు క్లాప్ కొట్టగా..ఫస్ట్ షాట్ డైరెక్షన్ నాగ్ అశ్విన్ చేశారు. జెమినీ కిరణ్, శరత్ మరార్ స్క్రిప్ట్ అందజేశారు. చిత్ర ప్రారంభోత్సవంలో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. “ఇది చాలా మంచి కామెడీ ఎంటర్‌టైనర్. ప్రేక్షకులు నా నుంచి కోరుకునే ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామా అన్నీ ఇందులో వుంటాయి. ఏప్రిల్ 10 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News