Sunday, November 17, 2024

తెలంగాణ కంటి వెలుగు అద్భుతం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్య క్రమాలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశం సించారు. ఢిల్లీ అసెంబ్లీలో నిర్వహించిన విలేకరుల సమావే శంలో కంటి వెలుగు, సాగునీటిరంగ అద్భుత ప్రగతిపై కే జ్రీవాల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కంటి వెలుగు కార్యక్ర మం సందర్శనకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసి ఆర్ ఆహ్వానిస్తే తాను వెళ్లానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం లో 3 నుంచి 4 కోట్ల జనాభా ఉందని, ప్రజలందరికీ ఉచి తంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

కంటి వెలుగు కార్యక్రమంలో ఉచితంగా కళ్లద్దాల పంపిణీ చేయ డంతో పాటు అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేయిస్తు న్నారని అన్నారు. అలాంటి కార్యక్రమాలను చూసి నేర్చు కోవాలని చెప్పారు. తాము ఢిల్లీలో, పంజాబ్‌లో మాన్ సింగ్ అమలు చేస్తామని అక్కడే చెప్పామని గుర్తు చేశారు. తెలం గాణలో సాగునీటి రంగంలోనూ అద్భుతమైన పనులు జరు గుతున్నాయని, వాటిని పరిశీలించడానికి పంజాబ్ ముఖ్య మంత్రి మాన్ సింగ్ మరోసారి ప్రత్యేకంగా తెలంగాణకు వెళ్లారని పేర్కొన్నారు. మంచి పనులు జరుగుతున్నప్పుడు వేరొకరి నుంచి ఎందుకు నేర్చుకోకూడదని ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News