- Advertisement -
హైదరాబాద్: వ్యక్తిగత డేటా సేకరించి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. డేటా విక్రయిస్తన్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దేశ వ్యాప్తంగా కోట్ల మంది డేటాను ముఠా సేకరించింది. సైబర్ నేరగాళ్లు డేటా సేకరించి విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. బ్యాంకులు, సిమ్ కార్డుల పేరుతో నేరగాళ్లు సందేశాలు పంపుతున్నారు. సందేశాల్లో లింకులు పెట్టి క్లిక్ చేయగానే చరవాణిలో వ్యక్తిగత సమాచారం చోరీ అవుతుంది. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధుల్లో వందల కేసులు నమోదయ్యాయి. సైబర నేరగాళ్లు అవసరం లేకపోయినా అనవసర సందేశాలు పంపుతున్నారు. ఇటీవల హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ పేరుతో అధిక సంఖ్యలో సందేశాలు పంపారు. మూడు కమిషనరేట్ల పరిధిలో బాధితులు ఫిర్యాదు చేశారు.
- Advertisement -