- Advertisement -
గన్నేరువరం: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి విషయంలో తండ్రితో కుమారుడు గొడవపడడంతో హత్య చేశారు. తండ్రి శంకరయ్యను కుమారుడు బ్యాట్‌తో కొట్టి చంపాడు. దీంతో గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -