Friday, December 20, 2024

లాడెన్ నా దేవుడు అన్నందుకు ఉద్యోగం ఊస్ట్

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: దేవుళ్లను ఆరాధించే వాళ్లను మనం చాలామందినే చూస్తుంటాం. అయితే రాక్షసులను ఆరాధిస్తున్నామని ఎవరనవ్నా అంటే మాత్రం వీడు తేడా అని అనుమానిస్తాం. అసలు విషయానికి వస్తే ఉత్తర్ ప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(యుపిపిసిఎల్)లో సబ్ డివిజనల్ అధికారిగా పనిచేస్తున్న రవీంద్ర ప్రకాష్ గౌతమ్‌కు ఒకప్పటి అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ అంటే ఆరాధనా భావం. ఇంజనీర్ చదువుకున్న లాడెన్‌ను మించిన ఇంజనీర్ ఈ ప్రపంచంలోనే లేడని గౌతమ్ భావిస్తాడు. అందుకే లాడెన్ ఫోటోను తన ఆఫీసు గోడకు తగిలించి రోజూ పూజిస్తాడు. ఒక ఉగ్రవాది ఫోటోను ప్రభుత్వ కార్యాలయంలో గోడకు తగిలించడమేమిటని అధికారులు విచారణ జరిపి గౌతమ్‌ను ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయాలని పిపిసిఎల్ చైర్మ్‌న్ ఎం దేవరాజ్ ఆదేశాలు జారీచేశారు.

2022లో ఫరుఖ్కాబాద్ జిల్లాలోని కాయంగంజ్ సబ్ డివిజన్ 2లో గౌతమ్‌కు సీనియర్ డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్‌గా బదిలీ అయింది. తన వెంటనే తెచుకున్న లాడెన్ ఫోటోను తన చాంబర్‌లోని గోడకు ఆయన తగిలించాడు. లాడెన్‌ను తాను అభిమానిచండమేగాక అమితంగా రాధిస్తానని గౌతమ్ అందరికీ చెప్పసాగాడు. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది పైఅధికారుల దృష్టికి వెళ్లింది. విచారణ జరిపిన ఉన్నతాధికారులు అతడిని విధుల నుంచి సస్సెండ్ చేశారు.

గౌతమ్ అధికారులపై దుర్భాషలాడాడని, ఇది క్రమశిక్షణారాహిత్యమని పేర్కొంటూ గౌతమ్‌ను ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేస్తున్నట్లు సోమవారం దేవరాజ్ తన ఉత్తర్వులో పేర్కొన్నారు. లాడెన్‌ను అత్యుత్తమ ఇంజనీర్‌గా అభివర్ణిచడమేగాక అతని ఫోటోను తన కార్యాలయం ఉంచడం కూడా క్రమశిక్షణారాహిత్యమని ఉత్తర్వుల్లో తెలిపారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి జాతి వ్యతిరేక చర్యకు పాల్పడ్డారని, డిపార్ట్‌మెంట్ ప్రతిష్టకు భంగం కలిగించారని దేవరాజ్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News