- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు వర్షాలు పడనున్నాయని వాతావరణ కేంద్రం గురువారం ప్రకటించింది. నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురువనున్నాయని తెలిపింది. మార్చి నెల 25,26,27 తేదీల్లో వడగళ్ల వాన కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు పడే అవకాశమున్నట్లు సమాచారం. గంటలకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు, సాయంత్రం వర్షం పడే అవకాశముందని అధికారులు తెలిపారు. సాధారణం కన్నా ఒక డిగ్రీ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి.
- Advertisement -