Sunday, November 24, 2024

పోలీస్టేషన్‌కు కూతవేటు దూరంలో బ్యాంకులో దోపిడి

- Advertisement -
- Advertisement -

మల్హర్: భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలం కొయ్యూరు తెలంగాణ గ్రామీణ బ్యాంకు(Telangana Grameena Bank) లో చోరీకి ప్రయత్నం చేసిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం గురువారం ఉదయం బ్యాంకు సమయంలో బ్యాంకు సిబ్బంది బ్యాంకుకు వెల్లగా చోరి ప్రయత్నం జరిగిన సంఘటనను గుర్థించి పోలీసులకు బ్యాంకు మేనేజర్ అవినాష్ పిర్యాధు చేయడంతో కాటారం సిఐ రంజిత్‌రావు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. మంగళవారం రాత్రి సమీపంలోని వెల్డింగ్ షాప్ లో గ్యాస్‌లు దొంగతనం చేసుకొనివచ్చి ఆదే సమయంలో రాత్రి సుమారు 12.30 గంటలకు బ్యంకు చిన్న గేటును వెల్టింగు సహాయంతో తోలగించి లోపలికి వెల్లి బ్యాంకులోకి వెల్లేందుకు కిటికిని తొలగించే సమయంలో విపలమై దొంగలు పారిపోయినట్లు తెలుస్తుంది.

దొంగలు తెలిగా మంకీ క్యాపులు వాడినట్లు సిసి కెమరాలో తెలుస్తుంది. బ్యాంకు ముందు ఉన్న సిసి కెమెరాలను వెనగభాగంనుండి వెల్లి పగల కొట్టారు. మంగళవారం రాత్రి వెల్డింగ్ షాప్ లో గ్యాస్ దొంగతనం జరుగగా బుధవారం ఉగాది పండుగ రోజు శాపు యజమాని సారయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉగాది కావున సెలవు దినం కావడంతో బ్యాంకు వారు వచ్చిన గురువారం రోజు సంఘటన వెలుగులోకి వచ్చింది. బ్యాంకులోకి దొంగలు వెల్లలేక పోవడంతో బ్యాంకుకు ఎలాంటి నష్టం జరుగలేదు దీంతో బ్యాంకు సిబ్బంది ఊపిరిపీల్చుకున్నట్టైంది. ఈ సంఘటనపై పోలీసులు కుక్కలు, ప్రత్యేక బృందాలతో విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసుస్టేషన్ 200 మీటర్ల సమీపంలో ఉన్నబ్యాంకులో దోపిడికి ప్రయత్నం జరుగడం దొంగలు దైర్యంతీరుకు అద్దపడుతుంది. దొంగతనం కేసును అతితొండరగా పోలీసులు చేదించాలని ప్రజలు కోరుకుంటులన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News